Thursday, January 23, 2025

ఎవరెస్టుపై 500 మంది సాహసికులు..

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ : హిమాలయాల శిఖర సమాన ఎవరెస్టు శుక్రవారం సందడిగా మారింది. నలుగురు భారతీయులు సహా మొత్తం 500 మంది పర్వతారోహకులు మౌంట్ ఎవరెస్టును అధిరోహించారు. అత్యంత తీవ్రస్థాయి విషమ వాతావరణ పరిస్థితి ఉన్నప్పటికీ , మంచుశిఖరాలు కరుగుతున్నప్పటికీ లెక్కచేయకుండా ఈ సాహసికులు శిఖరం చేరి, జెండాలు పాతారు. మౌంట్ ఎవరెస్టుపైకి తొలి అవహరణ ఘట్టం జరిగి 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎవరెస్టు విజయోత్సవ 70వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ జట్టు ఇక్కడికి చేరుకుంది. 1953 మే 29వ తేదీన న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్ షెర్పా టెన్సింగ్ నార్కే జంటగా ఈ ఎవరెస్టు చేరారు.

సముద్ర మట్టానికి 29, 032 అడుగుల ఎత్తున ఉండే ఈ మంచుశిఖరం చేరడం అత్యంత క్లిష్టతరం, ప్రాణాలతో చెలగాటాల తంతు. అయితే పలు దేశాలకు చెందిన సాహిసిక పర్వతారోహకులు ప్రతి ఏటా ఎవరెస్టు అధిరోహణానికి దిగుతున్నారు. ఈ క్రమంలో 300 మందికి పైగా పలు కారణాలతో , ప్రత్యేకించి వాతావరణ సమస్యలతో , ప్రమాదాలతో చనిపొయ్యారు. కొందరు హిమ సమాధికి కూడా గురయ్యారు. ఇప్పుడు ఎవరెస్టు చేరిన భారతీయులలో యాషీ జైన్, మితిల్ రాజు, సునీల్ కుమార్, పింఖీ హరీస్ ఛెద్ ఉన్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News