Sunday, November 17, 2024

కోటీశ్వరులైన చెన్నై కంపెనీ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

Freshworks
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో స్థాపించబడి, అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కలిగిన కస్టమర్ సర్వీస్ సాఫ్ట్‌వేర్ మేకర్ ‘ఫ్రెష్‌వర్క్స్’ బుధవారం నాస్‌డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(అమెరికా)లో లిస్ట్ అయింది. దాంతో ఆ కంపెనీ పబ్లిక్, మార్కెట్ నుంచి 100 కోట్ల(1బిలియన్) డాలర్లను పెంచుకుంది. ఇప్పుడా కంపెనీ విలువ దాదాపు 10 వందల కోట్ల్ల(10 బిలియన్) డాలర్లకు పైనే అని చెప్పకతప్పదు. ఈ క్రమంలో ఆ కంపెనీ ఉద్యోగులు కాస్తా ఇప్పుడు కోటీశ్వరులైపోయారు.
ఆ కంపెనీ స్టాక్ బుధవారం ఓపెనింగ్ ట్రేడ్ లోనే 46.67 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. అంటే లిస్టింగ్ అయిన 36 డాలర్ల ధరకు 30 శాతం పెరిగిందని చెప్పాలి. ఫ్రెష్‌వర్క్స్ స్టాక్(క్లాస్ ‘ఎ’స్టాక్) ఐపిఒ ద్వారా 28.5 మిలియన్ స్టాక్స్‌ను జారీచేసింది. ఐపిఒ ధరను 32 డాలర్ల నుంచి 34 డాలర్ల రేంజీలో ఫిక్స్ చేయగా, బుధవారం అది అంతకు మించిన ధరలోనే ట్రేడ్ అయింది.
“2011లో మా కంపెనీని చెన్నైలో ఆరంభించినప్పుడు మేము ఇలా జరుగుతుందని ఊహించనైనా ఊహించలేదు. మా కల చాలా సాకారమైంది. ఓ భారత కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. మా కంపెనీ బాటలో ఇంకా అనేక భారత కంపెనీలు కూడా నడవనున్నాయనిపిస్తోంది” అని ఫ్రెష్‌వర్క్ కంపెనీ వ్యవస్థాపకుడు గిరీశ్ మాతృబూథం బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News