Friday, November 15, 2024

500 పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోదాస్పత్రి వైద్యుడు

- Advertisement -
- Advertisement -

500 పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి మైలురాయిని సాధించిన యశోద హాస్పిటల్స్ డాక్టర్
500 పైగా హార్ట్, లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసిన యశోద హాస్పిటల్స్
సీనియర్ హార్ట్, లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్. జ్ఞానేష్ టక్కర్

హైదరాబాద్: యశోద హాస్పిటల్స్ లోని గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగానికి చెందిన సీనియర్ హార్ట్-లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్, డాక్టర్ జ్ఞానేష్ థాకర్, ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి అరుదైన మైలురాయిని సాధించారు. (ఇది గుండె, ఊపిరితిత్తుల మార్పిడి యొక్క అంతర్జాతీయ రిజిస్ట్రీలో స్వతంత్రంగా ధృవీకరించబడింది).

డాక్టర్. జ్ఞానేష్ థాకర్ శిక్షణ కోసం యుఎస్‌ఎకు వెళ్లడానికి ముందు కార్డియోథొరాసిక్ సర్జన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆస్ట్రియా, యు పి ఎం సి, పిట్స్‌బర్గ్, టెంపుల్ యూనివర్సిటీ ఫిలడెల్ఫియాతో సహా గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి కేంద్రాలలో ప్రాక్టీస్ చేశాడు. అతను కేవలం 3 నెలల్లో 70 కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసినందుకుగానూ అక్కడి ప్రముఖ మ్యాగజైన్ “టెంపుల్ క్యాప్సూల్ మ్యాగజైన్” కవర్ పేజీలో ప్రచురించింది.

డాక్టర్. జ్ఞానేష్ థాకర్ అప్పటి నుండి USA లో ప్రముఖ డాక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నప్పటికీ అతను భారతదేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించడానికి తిరిగి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఒక భారతీయ రోగికి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి డాక్టర్ కూడా జ్ఞానేష్ థాకరే. అప్పటి నుండి అతను తన టీచింగ్ హాస్పిటల్స్ లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేశాడు. భారతదేశంలో మొదటి అతి తక్కువ ఇన్వాసివ్ (చిన్న గాటు)తో డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేశాడు.

ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్ వైద్యరంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. ప్రత్యేకించి కోవిడ్ 19 సమయంలో అత్యధిక సంఖ్యలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్ అంబులెన్స్ ద్వారా విషమపరిస్థితిలో వచ్చిన 100 కంటే ఎక్కువ కోవిడ్ రోగులకు అత్యాధునిక ఐసియు సంరక్షణతో పాటుగా, అవసరమైన వారికి ఎక్మో లాంటి అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో వారి ప్రాణాలు కాపాడి వారి మన్ననలు పొందింది.

అదేవిధంగా కోవిడ్ తగ్గిన తరువాత ఎదురయ్యే సమస్యలకు 24/7 క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, పల్మోనాలజిస్ట్‌లు, అనస్థీటిస్టులు, ఫిజియోథెరపీ, ప్రపంచ స్థాయి నర్సింగ్ సంరక్షణ అందిస్తోంది. కోవిడ్ నుండి కోలుకున్న చాలా మందిలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ (ఫైబ్రోసిస్) కారణంగా ఊపిరితిత్తుల మార్పిడి తప్పనిసరి అవుతుంది. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమున్న రోగులకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ట్రాన్స్‌ప్లాంట్ విభాగం యశోద హాస్పిటల్స్ సొంతమని డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News