Saturday, January 25, 2025

500 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షబాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. దేశం లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. వందల మందిని దేశం నుంచి పంపించేశారు. ఈ వివరాలను శ్వేతసౌథం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగానే ఉన్నవారే.

ఇక , అమెరికా చరిత్ర లోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు”అని కరోలిన్ వెల్లడించారు. మరోవైపు ట్రంప్ ఆదేశాలతో దక్షిణ సరిహద్దుల రక్షణకు 1500 మంది సిబ్బందిని పంపుతున్నామని పెంటగాన్ ఇటీవల వెల్లడించింది. ఇదిలా ఉండగా, అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్ధుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. టెక్సాస్ లోని ఎల్‌పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News