పశ్చిమ ఢిల్లీ మోతీ నగర్ ప్రాంతంలో సార్వత్రిక ట్రాఫిక్ తనిఖీలో ఒక మోటార్‌సైకిల్‌పై రవాణా చేస్తున్న 500 స్నిపర్ రైఫిల్ తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఒక మోటార్‌సైకిల్ నడుపుతున్న వ్యక్తిని ఆగవలసిందని సూచన చేశారని. కానీ అతను వేగం పెంచి పరారీకి ప్రయత్నించాడని, దానితో అతనిని వాహనాలపై వెంటాడారని ఈ విషయంలో దర్యాప్తు గురించి తెలిసిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
వాహనాలతో వెంటాడినప్పుడు అతను ఒక ట్రాఫిక్ స్టాప్ సమీపంలో మోటార్‌సైకిల్ వదిలేసి పారిపోయాడని ఆయన చెప్పారు. పోలీసులు మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేయగా ఒక సంచీ కనిపించింది. సంచీలో 7.62 కాలిబర్‌వి 500 కార్ట్రిజెస్‌తో కూడిన 10 పెట్టెలను వారు కనుగొన్నారని, ఈ విషయమై మోతీ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేసి, కార్ట్రిజెస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి వివరించారు. ఆయుధాల చట్టం కింద ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుని గుర్తించేందుకు పలు బృందాలనుఏర్పాటు చేశారు.