Monday, December 23, 2024

త్రిపురలో 500 మంది తీవ్రవాదుల లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

అగర్తల: నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఎన్‌ఎల్‌ఎఫ్‌టి), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్(ఎటిటిఎఫ్)కు చెందిన దాదాపు 500 మంది తీవ్రవాదులు మంగళవారం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎదుట ఆయుధాలు విసర్జించారు. సెపాహీజాలా జిల్లాలోన జంపూయిజలాలో జరిగిన ఒక కార్యక్రమంలో లొంగిపోయిన తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఏ సమస్యకూ తీవ్రవాదం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఈ సామూహిక లొంగుబాటు తర్వాత త్రిపుర రాష్ట్రం పూర్తిగా తీవ్రవాద విముక్త రాష్ట్రంగా మారిందని ఆయన ప్రకటించారు.

బుధవారం 500 మంది తీవ్రవాదులు లొంగిపోయారని, రానున్న రోజుల్లో మిగిలినవారు కూడా లొంగిపోతారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. లొంగుబాటు సందర్భంగా తీవ్రవాదులు తమ వద్ద ఉన్న అధునాతన ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో సెప్టెంబర్ 4న ఢిల్లీలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరన ఒప్పందం తర్వాత తీవ్రవాదుల లొంగుబాటు జరిగింది. 1990 దశకం చివరి నుంచి రెండు దశాబ్దాలపాటు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన ఈ రెండు తీవ్రవాద గ్రూపుల కారణంగా వేలాదిమంది ప్రజలు ప్రత్యేకంగా గిరిజనేతరులు నిరాశ్రయుల్యారు. లొంగిపోయిన తీవ్రవాదుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News