Saturday, November 16, 2024

రోడ్డు ప్రమాద బాధితులను సత్వరం ఆదుకునే వినూత్న పథకం

- Advertisement -
- Advertisement -

5000 Cash for road accident victims: MK Stalin

చెన్నై : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆదుకునేలా తమిళవాడు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి వైద్యసదుపాయాలు అందించడంలో తోడ్పడే వ్యక్తులకు నగదు బహుమతులతోపాటు ధ్రువ పత్రాలు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ విధంగా తోడ్పాటు అందించిన వారికి రూ. 5000 నగదు, ప్రశంసా పత్రం అందించనున్నాం అని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే ఓ పథకాన్ని సీఎం స్టాలిన్ గతంలో ప్రారంభించారు. తమిళనాడు లోని మొత్తం 609 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గోల్డెన్ అవర్ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ పథకంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందే బాధితులకు గరిష్ఠంగా రూ. లక్ష వరకు రాయితీ ఇస్తోంది. కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పర్యటనకు వచ్చి గాయపడిన వారికి కూడా ఈ పథకాన్ని అందుబాటులో ఉంచడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News