Sunday, April 27, 2025

మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు

- Advertisement -
- Advertisement -

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు వారి దేశానికి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నారని, అందులో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లాలని వారికి సూచించామన్నారు. “ రాష్ట్రంలో దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు 4 వేల మంది ఉంటారు. సార్క్ వీసా కింద మరో వెయ్యిమంది ఉన్నారు.

వీరిలో సినిమాలు, వైద్యం, జర్నలిజం, వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చారని మంత్రి తెలిపారు. పాక్ జాతీయుల్లో కొందరు ఎనిమిది నుంచి పదేళ్లుగా భారత్ లోనే ఉంటున్నారని , కొందరు వివాహం చేసుకోగా, మరికొందరు పాకిస్థాన్ పాస్‌పోర్టును సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. స్వల్పకాలిక వీసాలపై వచ్చిన వారు ఏప్రిల్ 27 లోగా వెళ్లిపోవాలని సూచించామని, వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం అదనంగా మరో రెండు రోజులు గడువు ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News