మన తెలంగాణ/గోషామహల్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్ అండ్ ఓ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు, గోషామహల్ స్టేడియంతో పాటు అ నేక ఇతర కార్యాలయాల్లో వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పోలీసులు వేలం వేశారు. తొలి విడతలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన 600 వాహ నాలను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో గోషామహల్ పోలీస్ స్టేడియంలో బహిరంగ వేలానికి పెట్టారు. ఈ వేలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 550 మంది బిల్డర్లు పాల్గొన్నారు. నగరానికి చెందిన రెండు కార్లతో పాటు 568 ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను పోలీసులు వేలంలో వి క్రయించారు. ఈ వేలం ద్వారా రూ.51, 74, 000 ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరిందని నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. పత్రికా ప్ర కటనల ద్వారా యజమానులకు తెలియజేసినా, స్పందన లేక పోవడంతో వేలం నిర్వహించినట్లు తెలిపారు. రెండో విడతలో 5వేల వాహనాలను వేలం లో పెట్టనున్నామని, మిగతా వాహనాలు విక్రయించేందుకు వీల్లేకుండా ఉన్నాయని సిపి తెలిపారు.