మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రూపురేఖలను మార్చే రాష్ట్ర బడ్జెట్‌లో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. గత నెల రోజులుగా వివిధ శాఖలకు సం బంధించి నిధుల అవసరాలు , పథకాల అమలు ప్రాధాన్యతలతో కసరత్తులు చేస్తూ వచ్చిన కేసిఆర్ సర్కారు సోమవారం నాడు ప్రగతి బడ్జెట్‌ను చట్ట సభల్లో ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ అత్యంత ప్రాధాన్యతారంగంగా భావించే వ్యవసా య రంగానికి ఈసారి బడ్జెట్‌లో ఎంతమేరకు ని ధులు కేటాయిస్తారన్న దానిపైనే రాష్ట్ర రైతాంగం తన కేంద్రీకరించింది. 2022-2023 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. కూడా కరోనా కష్టకాలంలో సైతం రాష్ట్ర ఖజానాను వ్యవసాయ అనుబంధ రంగాలే ఆదుకున్నాయి. లక్షలాది మందికి ఈ రంగమే వ్యవసాయ పనులు కల్పించి అక్కున చేర్చుకుంది. పరోక్షంగా వర్తక ,వాణిజ్య, సేవా రంగాలకు ఊపిరినిచ్చింది. రాష్ట్ర జిడిపిలో అత్యంత ప్రాధాన్యతరంగాల్లో ఒకటిగా వున్న వ్యవసాయ రంగానికి రా్రష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మరింత ప్రాధాన్యత పెంచే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రణాళికాశాఖక చెందిన కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సారి వ్యవసాయం, పశుసంవర్ధక, మత్సపరిశ్రమ, పాడిపరిశ్రమ రంగాలతో పాటు వ్యవసాయానికి అత్యంత కీలకమైన నీటిపారుదల రంగాలను కలుపుకొని రాష్ట్రబడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ఆరలక్ష కోట్ల మార్కు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.1.50లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్టు అధికారవర్గా ల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నెల చివరాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ,వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43661కోట్లు కేటాయించింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయ అనుబంధ రంగాలకే ప్రాధాన్యత ఇచ్చింది.వ్యవసాయరంగానికి రూ.25వేలకోట్లు కేటాయించగా, అందులో నేరుగా రైతుకు నగదు అందజేసి పంటసాగును ప్రోత్సహించే రైతు బంధు పథకానికికే సగభాగం నిధులు కేటాయించింది.ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.14800కోట్లు కేటాయించిన ప్రభుత్వం రైతుబీమా పథకానికి కూడా రూ.1200కోట్లు కేటాయించింది.
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం రైతులకు పంటరుణాల మాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ పథకానికి రూ.5225కోట్లు కేటాయించింది. వీటితోపాటు పంటల సాగులో పెట్టుబడి వ్యయంతోపాటు కూలీల సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ ఈ పథకానికి రూ.1500కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో సాగుభూముల విస్తీర్ణంతోపాటు రైతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో వచ్చేబడ్జేట్‌లో రైతుబంధు పరిధి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైతుల సంఖ్యకుతగ్గట్టుగానే రైతుబీమాకు ప్రీమియం మొత్తం కూడా పెరగనుంది. రైతులకు పంటల సాగును మరింత లాభదాయకంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను ప్రోత్సహిస్తోంది. నాణ్యవంతమైన విత్తనాలు, వాటికి సబ్సిడీలు, వంటి వాటికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్దిలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున మినిడెయిరీలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. పశుసంవర్ధక శాఖకు 202122లో రూ.1730కోట్లు కేటాయించిన ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో ఈ రంగానికి నిధుల కేటాయింపులు మరింత పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
నీటిపారుదలకు ప్రాధాన్యం:
రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి నిధుల కేటాయింపులు పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం . రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరినదుల పరివాహకంగా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు పలు సాగునీటి పధకాలను సిఎం ప్రకటించారు. కొత్త పథకాలన్నింటికి 2022-23బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పాలమూరురంగారెడ్డి వంటి పథకాలకు ప్రాధ్యాన్యక క్రమంలో నిధులు కేటాంచనున్నారు. ఈ ఏడాది నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.16931కోట్లు కేటాయించింది. కొత్తగా వచ్చే 2022-23 బడ్జెట్‌లో ఈ రంగానికి నిధుల కేటాయింపులు గణనీయంగా పెరగే అవకాశాలు ఉన్నట్టు నీటిపారుదల వర్గాల సమాచారం.