అందులో చిన్నారులే వేలాది మందిని చంపేశారు: జెలెన్‌స్కీ
బుచాలో వారం కర్ఫ్యూ
కీవ్: రష్యన్ దాడులతో అతలాకుతలమై న ఉక్రెయిన్ పోర్టు సిటీ మరియుపోల్‌లో 5,000 మంది పౌరులు చనిపోయినట్లు ఆ నగర మేయర్ చెప్పారు. కాగా దేశ రా జధాని కీవ్ శివారు పట్టణాలను వదిలి పెట్టి వెళ్లే క్రమంలో రష్యా పా ల్పడ్డ అకృత్యాలకు సంబంధించిన సాక్షాధారాలను సేకరించే పనిలో ఉక్రెయిన్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. కాగా కీవ్, చెర్నిహివ్ ప్రాంతాలనుంచి తన బలగాలను ఉపసంహరించుకున్న రష్యా తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై తన దృష్టిని కేంద్రీకరించే అవకాశముందని, అందువల్ల వీలయినంత త్వరగా ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని లుహాన్స్ గవర్నర్ సెర్హీ హైదా య్ అన్నారు. ప్రజలను తరలించే అన్ని మార్గాలను మూసివేసేందుకు రష్యా దళాలు యత్నిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ కొద్ది రోజులే చివరి అవకాశం కావచ్చని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ఉత్తరప్రాంతంలోని కీవ్, చెర్నిహివ్ ప్రాంతాలనుంచి రష్యా మొత్తం 24 వేల మంది సైనికులును ఉపసంహరించుకుని బెలారస్ లేదా రష్యాకు పంపించిందని, తూర్పు ప్రాంతంలో దాడులు జరిపేందుకోసం తిరిగి శక్తియుక్తులను సమకూర్చు కోవడానికే ఆ పని చేసి ఉండవచ్చని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. డాన్‌బాస్ ప్రాంతాలనుంచి పౌరులు ఇప్పుడు ఖాళీ చేయకపోతే ఆ తర్వాత తాము ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్ అన్నారు.
వేలాది మందిని చంపేశారు: జెలెన్‌స్కీ
మరియుపోల్‌లోకి మానవతా సాయం వెళ్లకుండా అడ్డుకొంటున్న రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండి పడ్డారు. ఎందుకంటే అక్కడ వేలాది మందిని రష్యా సైన్యాలు చంపేశాయని, తాము అక్కడికి వెళితే రష్యా సైన్యం అసలు స్వరూపం బయటపడుతుందన్న భయంతోనే మానవతా కారిడార్‌ను అడ్డుకుంటోందని మండిపడ్డారు. మరియుపోల్ 90 శాతం ధ్వంసమైందని స్థానిక మేయర్ వాదిమ్ బయోచెంకో చెప్పారు. ఈ దాడుల్లో 5 వేలమందికి పైగా పౌరులు చనిపోయారని, వారిలో 210 మంది చిన్నారులని ఆయన చెప్పారు. దోపిడీల కట్టడి, మం దుపాతరల తొలగింపు పనుల నేపథ్యంలో స్థానిక అధికారులు గురువారం కీవ్ సమీపంలోని బుచాలో ఏడురోజుల పాటు కర్ఫూ విధించారు. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, సైనిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని జి7కూటమి ప్రకటించింది. జి7 దేశా విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబాతో సమావేశమైన అనంతరం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. బుచాతో పాటుగా రష్యా అక్రమణలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఊచకోతలు.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలుగా నమోదు చేస్తామన్నారు.
50000 killed in Mariupol under Russian Army Attack