- Advertisement -
రష్యాలోని సైబీరియాలో మంచు కరగడంతో 50వేల ఏళ్లనాటి గున్న ఏనుగు అవశేషాలు వెలుగు చూశాయి. ఆ గున్న ఏనుగుకు ‘యాన’ అనే నిక్‌నేమ్ పెట్టారు. అది 100 కిలోల 200 పౌండ్ల బరువు, 120 సెమీ.(47 అంగుళాల) ఎత్తు, 200 సెమీ.(79 అంగుళాల) పొడవుతో ఉంది. 50వేల ఏళ్ల క్రితం చనిపోయేనాటికి ‘యాన’ ఏడాది వయస్సుదై ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా వెలుగుచూసిన ఏడు ఏనుగు భౌతిక కాయాలలో ఇదొకటని వారన్నారు.తూర్పు రష్యాలోని యకుతియా ప్రాంతంలో ‘బతగైక క్రేటర్’ వద్ద ఇది లభించింది.రష్యాలోని ఈశాన్య ఫెడరల్ యూనివర్శిటీలో సైంటిస్టులు యాన అవశేషాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇది అసాధారణమయైనదని, పరిశోధకులకు కొత్త సమాచారం అంటే అది ఎలా జీవించింది, పరిసరాలను ఎలా అనుగుణంగా మార్చుకున్నది వంటి విషయాలు తెలియగలవని యూనివర్శిటీ పేర్కొంది.
- Advertisement -