Monday, December 23, 2024

రూ.500కే గ్యాస్ .. బారులు తీరిన మహిళలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన ‘మహాలక్ష్మి’పై పాతబస్తీలో పుకార్లు శికార్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఏవి లేకుండానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంటూ మహిళలు పెద్ద ఎత్తున గ్యాస్ కంపెనీలు, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. నిజానికి గ్యాస్ ఏజెన్సీలు కేవైసి (నో యువర్ కస్టమర్) దరఖాస్తులను వినియోగదారుల నుండి స్వీకరిస్తున్నారు. భారత ప్రభుత్వంచే నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది. అయితే కొందరు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంటూ, అందుకు అవసరమైన ధృవపత్రాలతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు.

అంతేకాకుండా తమ బ్యాంకు ఖాతా గల బ్యాంకులకు వెళ్ళి ఆధా ర్, గ్యాస్ ఖాతాతో జతచేయించుకుంటున్నారు. ఉన్నట్లుండి జనాలు ఒక్కసారిగా వస్తుండటంతో బ్యాంకు అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు నివ్వెరపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఇంత వరకు రాలేదని వారు సర్ధిచెప్పినా జనం వినటం లేదు. అంతేకాకుండా మహిళలకు ప్రతినెల రూ.2500కు సంబంధించిన అవసరమైన ధృవపత్రాల వివరాల పోస్టును సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News