Monday, November 18, 2024

కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది

- Advertisement -
- Advertisement -

50196 new covid cases reported in Germany

బెర్లిన్ : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా చెలరేగుతోంది. అందులో జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా ఇదివరకెన్నడూ లేని రీతిలో వ్యాపిస్తోంది. తాజాగా 50,196 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. జర్మనీలో కరోనా కేసులు 50 వేల వరకు నమోదు కావడం ఇదే మొదటిసారి. అక్టోబర్ నుంచి అక్కడ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కరోనా కొత్త పద్ధతిలో వేగంగా తిరిగి వ్యాపిస్తోందని, తగిన కట్టడి చర్యలతో అదుపు లోకి తీసుకురావాలని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడం కూడా తాజా పరిస్థితికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో 67 శాతం మంది మాత్రమే పూర్తిగా టీకా వేయించుకున్నారు. టీకా తీసుకోలేని వారిని బార్లు, రెస్టారెంట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లోకి అనుమతించడం లేదు. కొత్త కేసులు కారణంగా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇతర వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వరల్డ్ మీటర్ గణాంకాల ప్రకారం జర్మనీలో 46 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, 97,599 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News