Saturday, November 23, 2024

తీవ్ర పేదరికంలోకి 50కోట్ల మంది: డబ్లుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

50cr people fell into poverty due to Covid: WHO

జెనీవా: యూనివర్శల్ హెల్త్ కవరేజి విషయంలో రెండు దశాబ్దాలుగా ప్రపంచం సాధించిన పురోగతిని కొవిడ్ కమహమ్మారి దెబ్బతీసే అవకాశం ఉందని, వైద్యసేవల కోసం సొంతంగా ఖర్చు పెట్టాల్సి రావడంతో 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయారని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన విశ్లేషణలో పేర్కొంది. వైద్య సేవలు పొందే సామర్ధంపై కొవిడ్ ప్రభావాన్ని ఎత్తి చూపుతూ కొవిడ్ తర్వాత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకోడానికి ప్రయత్నిస్తోన్న దేశాలకు ఈ హెచ్చరిక చేసింది. ఇక సమయం లేదని, ప్రపంచ దేశాలన్నీ వెంటనే స్పందించాలంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక సారాన్ని కూడా వెల్లడించింది. ఆదాయాలు తగ్గి పేదరికం పెరిగి కఠినమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వాలకు ఈ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు నివేదికలు హెచ్చరించాయి. కొవిడ్ రాకకు ముందే దాదాపు 100 కోట్ల మంది తమ ఆదాయంలో 10 శాతానికి పైగా ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రభావం పేదలపై తీవ్రంగా పడింది. ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవల వ్యయాన్ని పెంచేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకుకు చెందిన జువాన్ ఉరిబె వెల్లడించారు.

మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాలు తమ పౌరులంతా ఆర్థిక పరిణామాలకు భయపడకుండా ఆరోగ్య సేవల్ని పొందగలరని నిర్ధారించే ప్రయత్నాలను వెంటనే తిరిగి ప్రారంభించాలని వాటిని వేగవంతం చేయాలని వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని దీనర్ధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.అలాగే ఇంటికి దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా వ్యవస్థల్ని నిర్మించాలని సూచించారు. యూనివర్శల్ హెల్త్ కవరేజి దిశగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పేదలు వైద్యం కోసం స్వంతంగా డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈమేరకు పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని సూచించింది.

50cr people fell into poverty due to Covid: WHO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News