- Advertisement -
న్యూఢిల్లీ : జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) నెట్‌వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం ఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్ 50వ సమావేశం జరిగింది. సినిమా హాళ్లలో లభించే ఆహార పదార్థాలు, పానీయాల ధరలు ఇకపై తగ్గనున్నాయి. థియేటర్లలో ఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జిఎస్‌టి 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా పాప్‌కార్న్, డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలను సినిమా టిక్కెట్లతో కలిపి విక్రయిస్తే, అసలు ఉత్పత్తి ఆధారంగా పన్ను విధించాలని కూడా సూచించింది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -