Tuesday, January 7, 2025

ప్రయాణీకులకు శుభవార్త…

- Advertisement -
- Advertisement -

సంక్రాంతికి మరో 52 అదనపుప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. ఈసారి సంక్రాంతి కోసం ఇప్పటికే 122 స్పెషల్ రైళ్లను సిద్ధం చేసినట్లుగా తెలిపింది. వాటికి అదనంగా మరో 60 రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు కొద్ది రోజుల క్రితమే సిపిఆర్‌ఓ(దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి) శ్రీధర్ వెల్లడించారు.

కాగా వీటికి అదనంగా మరో 52 ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు సిపిఆర్‌ఓ వెల్లడించారు. చర్లపల్లి నుండి తిరుపతి, వికారాబాద్ నుండి కాకినాడ టౌన్, కాచిగూడ నుండి తిరుపతి, చర్లపల్లి నుండి నర్సాపూర్, సికిందరాబాద్ నుండి కాకినాడ టౌన్, చర్లపల్లి నుండి కాకినాడ టౌన్, చర్లపల్లి నుండి శ్రీకాకుళం రోడ్, కాచిగూడ నుండి శ్రీకాకుళం రోడ్ తతితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్ళు ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలోనూ ఆయా నగరాల మధ్య నడుస్తాయని వెల్లడించారు. . గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు వివరించారు. కాగా మరోవైపు ఉన్న రైళ్లకు బోగీలను పెంచే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

మారిన టెర్మినల్ స్టేషన్‌లు

పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు రైలు సౌకర్యాన్ని క ల్పిస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరోవైపు హైదరాబాద్, సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు పలు రైళ్ళ టెర్మినల్ స్టేషన్‌లను మార్చుతున్న రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై సెంట్రల్‌హైదరాబాద్‌చెన్నై సెంట్రల్ (12603/12604) రైళ్ల టెర్మినల్‌ను హైదరాబాద్ నుంచి చర్లపల్లికి మార్చుతున్నట్లు తెలిపారు. గోరక్‌పూర్‌సికిందరాబాద్‌గోరఖ్‌పూర్ (12589/12590) రైలు టెర్మినల్‌ను సికిందరాబాద్ నుంచి చర్లపల్లికి మార్చారు. కాగా సికిందరాబాద్‌సిర్‌పుర్ కాగజ్‌నగర్‌సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్, గుంటూర్‌సికిందరాబాద్‌గుంటూర్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్‌సిర్‌పుర్ కాగజ్‌ణగర్‌సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక నుండి చర్లపల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News