- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని రైల్వే అరెస్ట్ చేశారు. విధ్వంసంలో పాల్గొని పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో 200కుపైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్, రైల్వే పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఘటనపై డివిజనల్ మేనేజర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ అల్లర్లలో రూ. 12కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -