ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది కార్మికులు మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఢాకా శివారులోని నర్యాంగంజ్ రుప్‌గంజ్‌లోని ఫ్యాక్టరీలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వినాశకరమైన ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పలువురు కార్మికులు భవనంపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఆ భవనంలో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉండడంతో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఉండడం వల్ల భవనం నేల అంతస్తు నుంచి మంటలు చెలరేగి త్వరగా వ్యాపించాయని అనుమానిస్తున్నారు. మంటలను అరికట్టడానికి పద్దెనిమిది అగ్నిమాపక విభాగాలు కష్టపడుతున్నాయి. ఇంకా తప్పిపోయిన వారిని వెతుక్కుంటూ ప్రజలు భవనం ముందు గుమిగూడారు. తప్పిపోయిన చాలా మందిలో 44 మంది కార్మికులను గుర్తించామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
52 dead in fire accident at Bangladesh