Monday, December 23, 2024

కరోనా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల

- Advertisement -
- Advertisement -

5233 new covid cases reported in india

 

న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 4 వేలకు సమీపం లోనే నమోదవుతోన్న రోజువారీ కేసులు తాజాగా 5 వేలకు పైగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసులు కూడా వేగంగా పెరుగుతూ 29 వేలకు చేరువ కావడం వైరస్ ఉద్ధృతిని తెలియజేస్తోంది. మంగళవారం 3,13,361 కరోనా పరీక్షలు చేయగా, 5233 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి చేరింది. దేశంలో కొత్త కేసులు 5 వేలు దాటడం 93 రోజుల తరువాత ఇదే తొలిసారి. అంతకుముందు రోజు ( 3714) కేసులుతో పోల్చితే కొత్త కేసుల్లో 41 శాతం పెరుగుదల కనిపించింది. ఇక మహారాష్ట్ర , కేరళల్లో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం ఈ రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి. తాజాగా కేరళలో 2271 కేసులు, మహారాష్ట్రలో 1881 కేసులు వెలుగు చూశాయి.

ఫిబ్రవరి 18 తరువాత మహారాష్ట్రలో ఇన్ని కేసులు రావడం మళ్లీ ఇప్పుడే. ముంబైలో 1242 కేసులు రాగా, అంతకుముందు రోజుతో పోల్చితే దాదాపు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఏడుగురు మరణించగా, ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 5,24,715 కు చేరింది. మంగళవారం 3345 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4.26 కోట్లు ( 98.72 శాతం) దాటింది. రికవరీలు తక్కువగా ఉండటంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 28,857 ( 0.07 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మంగళవారం 14,94,086 మంది టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194.43 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News