Monday, December 23, 2024

525 మంది రేసు గుర్రాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించగా, మిగిలిన 625 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. వారిలో 100 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, 525 మంది అభ్యర్థులు పోటీలో ఉ న్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదిలాబాద్ లోక్‌సభ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీ నిలువగా, ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. 12 మంది పోటీలో నిలిచారు.

పెద్దపల్లి నియోజకవర్గానికి 49 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొం దగా, వారిలో ఏడుగురు తమ నామినేషన్లను విరమించుకున్నారు.42 మంది అభ్యర్థులు పోటీలో ని లిచారు. కరీంనగర్ ఎంపీ బరిలో 33 మంది అభ్యర్థులు నిలవగా.. ఐదుగురు ్ల పోటీ నుంచి తప్పుకున్నారు. 28 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత నిజామాబాద్‌లో 29 మంది, జహీరాబాద్‌లో 19 మంది, మెదక్‌లో 44 మంది, మల్కాజిగిరిలో 22 మంది, సికింద్రాబాద్‌లో 45 మంది, హైదరాబాద్‌లో 30 మంది, చేవెళ్లలో 43 మంది, మహబూబ్‌నగర్‌లో 31 మంది, నాగర్‌కర్నూల్‌లో 19 మంది, నల్గొండలో 22 మంది, భువనగిరి బరిలో 39 మంది నిలిచారు. ఈ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్‌లో 48 మందిలో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా, 42 మంది పోటీలో నిలిచారు.

మహబూబాబాద్‌లో ఇద్దరు పోటీ నుంచి తప్పుకోగా 23 మంది మిగిలారు. ఖమ్మం ఎంపీ బరిలో 41 మంది పోటీలో ఉండగా.. ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. 35 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News