Sunday, April 6, 2025

మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.53 కోట్ల నిధులు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.53 కోట్లు నిధులు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్నారు. ముంపు సమస్యలు నివారించడం కోసం ఎస్‌ఎన్‌డిపి పనులు చేపడుతామన్నారు. రెండు రోజుల క్రితం భారీ వర్షలు కురవడంతో ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరదలు వచ్చిన విషయం తెలిసిందే. మూసీలో భారీగా వరదలు రావడంతో మూసీకి ఇరువైపుల కాలనీలు మునిగిపోయాయి. రెండు రోజులు ఆ కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News