Sunday, February 23, 2025

ఉక్రెయిన్‌లో రాకెట్ల దాడి… 53 మంది యుద్ధ ఖైదీలు మృతి

- Advertisement -
- Advertisement -

53 Members dead in Rocket attack on Ukraine

కీవ్: ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ ప్రాంతంలో ఓ కారాగారంపై రాకెట్లతో దాడి చేయడంతో 53 మంది యుద్ధ ఖైదీలు మృతి చెందారు. ఈ దాడిలో 75 మంది వరకు గాయపడ్డారు. చనిపోయిన వారంతా రష్యాకు పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులేనని స్థానిక మీడియా తెలిపింది. అమెరికాకు చెందిన హిమార్స్ రాకెట్‌తో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపణలు చేస్తుంది. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం ఖండించింది. జైళ్లో ఉన్న యుద్ధ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేయడంతో కొందరిని చంపేసి, ఈ హత్యలను మరుగున పడేసేందుకు రష్యా ఈ పాపానికి పూనుకుందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News