Tuesday, November 5, 2024

తుపాను ప్రభావిత రాష్ట్రాలలో 53 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు

- Advertisement -
- Advertisement -

53 NDRF teams in cyclone affected states

 

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తౌక్టే తుపాను వల్ల సంభవించే పరిస్థితిని ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్) 53 బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన తీర ప్రాంతాలలో ఈ బృందాలను నియమించినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ 53 బృందాలలో 24 బృందాలు క్షేత్రస్థాయిలో ఉంటాయని, మిగిలిన బృందాలు ముందు జాగ్రత్తగా స్లాండ్‌బైలో ఉంటాయని ఆయన తెలిపారు.

ఒక్కో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందంలో సుమారు 40 మంది సిబ్బంది ఉంటారు. వారి వద్ద చెట్లు, స్తంభాలు కోసే యంత్రాలు, పడవలు, ప్రాథమిక వైద్య సామగ్రి, ఇతర సహాయ పరికరాలు ఉంటాయి. భారత వాతావరణ శాఖ అందచేసిన సమాచారం ప్రకారం ఆగ్నయ అరేబియా సముద్రంతోపటు సమీపాన ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో అల్పపీడనం గురువారం ఏర్పడింది. శనివారం ఉదయానికి కొన్ని రాష్ట్రాలలోని కోస్తా ప్రాంతాలలో అది వాయుగుండగా మారి రానున్న 24 గంటలలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ తీరం వైపు పయనించే అవకాశం ఉందని, మే 18వ తేదీ సాయంత్రానికి తుపాను గుజరాత్ కోస్తాను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను తౌక్టే అని మయన్మార్ పేరు పెట్టింది. అంటే ఊసరవెల్లి అని అర్థం. భారతీయ తీర ప్రాంతాలను తాకుతున్న మొదటి తుపాను ఇదే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News