Monday, December 23, 2024

మంటలతో పసిఫిక్‌లో దూకుతున్న జనం

- Advertisement -
- Advertisement -

లహైనా : అమెరికాలోని హవాయ్ దీవులలో తలెత్తిన కార్చిచ్చు మరింత ప్రజ్వరిల్లింది. మృతుల సంఖ్య ఇప్పుడు 53కు చేరిందని గవర్నర్ జోష్ గ్రీన్ శుక్రవారం తెలిపారు. హరికేన్ కూడా తోడుకావడంతో మంటలను అదుపులో పెట్టడం సాధ్యం కావడం లేదు. ఈ తరంలో ఇక్కడ ఇదే అతి పెద్ద కార్చిచ్చు విపత్తు అని గ్రీన్ వివరించారు. మంటలకు వందలాది ఇళ్లు తగులబడ్డాయి. మంటలు గాలి వాటును బట్టి పలువిధాలుగా విస్తరించుకుంటూ పోవడంతో పలువురు మంటల్లో చిక్కుపడుతున్నారని, ఇది ఘోరమైన ప్రకృతి వైపరీత్యం అని గవర్నర్ చెప్పారు. వెంటాడుతున్న మంటలు , ఉక్కిరిబిక్కిరి చేసే దట్టమైన పొగలతో జనం వీధులలో పరుగులు తీస్తున్నారు.

చివరికి ఏమి చేయాలో తెలియక పసిఫిక్ సముద్రంలో దూకుతున్నారు. అత్యంత అరుదైన కట్టడాలు బూడిదయ్యాయి. ఈ ప్రాంతంపై ఓ బాంబు పడినట్లు అయిందని తాను ఈ ప్రాంత మేయర్ రిచర్డ్ బిసెన్‌తో కలిసి ఇక్కడ పాదయాత్ర జరిపినట్లు గవర్నర్ చెప్పారు. హవాయి ప్రాంతంలో లహైవా కీలకమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ పరిస్థితి విషమించడంతో పర్యాటక రంగం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం అయింది. హవాయి ప్రాంతంలోని అలోనా స్టేట్‌లో అడవులలో పరిస్థితితో ఈ కార్చిచ్చు తీవ్రత పెరుగుతోంది. పంటపొల్లాలోని పంటల నూర్పిళ్లు వదిలిపెట్టి ఉంచడంతో మంటలు చెలరేగి నెలల తరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు ఈదురుగాలులు వీయడం కూడా పరిస్థితిని దిగజారుస్తోంది. హవాయ్‌లో పొడి వాతావరణం మంటల వ్యాప్తికి మరో కారణం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News