Monday, December 23, 2024

కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు

- Advertisement -
- Advertisement -

ఒకే జీవోతో చైర్మన్లు, వైస్ చైర్మన్లను తొలగించిన ప్రభుత్వం
ఈ నెల 7 నుంచే ఉత్తర్వులు అమలులోకి

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల, వైస్ చైర్‌పర్సన్ల నియామకాలను రద్దు చేసింది. ఒకే జీవోతో నియామకాలను రద్దు చేస్తూ ఆదివారం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తున్నట్లు సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఆఫీసుల్లో పిఎ, పిఎస్, ఒఎస్‌డిలుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేయగా, తాజా ఉత్తర్వులతో మిగతా కార్పోరేషన్ చైర్మన్లు కూడా వైదొలగనున్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెల-మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ రజని (సాయిచంద్ సతీమణి) తదితర మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News