Friday, January 3, 2025

కల్యాణ్ స్టేషన్‌లో 54 డెటోనేటర్లు లభ్యం

- Advertisement -
- Advertisement -

ఠాణె : మహారాష్ట్ర ఠాణె జిల్లాలో కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌పై ఎవరో వదలివేసిన రెండు పెట్టెల్లో 50కి పైగా డెటోనేటర్లు లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) అధికారి ఒకరు తెలిపారు. సెంట్రల్ రైల్వే (సిఆర్)లో సాధారణంగా రద్దీగా ఉండే నంబర్ 1 ప్లాట్‌ఫామ్‌పై ఎవరో వదలివేసిన ఆ పెట్టెలను జిఆర్‌పి సిబ్బంది చూసినట్లు ఆయన తెలియజేశారు.

ఆ వెంటనే జాగిలాల బృందాన్ని, బాంబు శోధన, నిర్వీర్య బృందం (బిడిడిఎస్)ను ఆ ప్రదేశానికి పిలిపించినట్లు ఆయన తెలిపారు. బిడిడిఎస్ బృందం ఆ పెట్టెలను స్వాధీనం చేసుకుని తెరచి చూడగా 54 డెటోనేటర్లు కనిపించాయని ఆయన తెలిపారు. కల్యాణ్ జిఆర్‌పి వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని, అయితే, ఈ సందర్భంగా జిఆర్‌పి కేసు ఇంకా నమోదు చేయలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News