Friday, November 22, 2024

హైదరాబాద్‌లో దాదాపుగా హెర్డ్ ఇమ్యూనిటీ

- Advertisement -
- Advertisement -

54% మందిలో కరోనా వ్యతిరేక యాంటీబాడీస్

జనాభాలో సగం మందికి వైరస్ ఇప్పటికే సోకింది, వారిలో 75% మందికి తమకు వచ్చిపోయినట్టు కూడా తెలియదు
సిసిఎంబి, భారత్ బయోటెక్, ఎన్‌ఐఎన్ సంయుక్త సీరో సర్వేలో వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీస్ 54 శాతం మందిలో ఉన్నట్టు సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) సర్వేలో తేలింది. అంటే మొ త్తం జనాభాలో సగటున సగం మందికి వైరస్ సో కిందని అర్ధం. వీరిలో ఏకంగా 75 శాతం మందికి వైరస్ వచ్చిపోయినట్లు కూడా వారికి తెలియదని సిసిఎంబి నివేదిక చెబుతోంది. వైరస్ వ్యాప్తిని అం చనా వేసేందుకు సిసిఎంబి, ఎన్‌ఐఎన్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషీయన్) సంస్థలు ఇటీవల జిల్లాల వారీగా, హైదరాబాద్‌లో తీవ్రత ఎలా ఉంది? అని రెండు వేర్వేరు విభాగాలుగా విభజిం చి సీరమ్ సర్వేను చేపట్టాయి. జిల్లాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి యంటీబాడీస్ డెవలప్ కాగా, హైదరాబాద్ పరిధిలో ప్రతి ఇద్దరిలో ఒకరికి యాంటీబాడీస్ రావడం గమనార్హం. కానీ మొత్తం జనాభాలో మరో 6 శాతం మందికి యాంటీబాడీస్ వృద్ధి చెందిదే హైదరాబాద్‌లో హెర్డ్‌ఇమ్యూనిటీ వచ్చినట్లేనని నిపుణులు అంటున్నారు. అయితే ఇవి ఎంత కాలం ఉంటాయనేది ప్రశ్నర్ధకంగా మారింది. వాస్తవంగా వైరస్ బారిన పడి, తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో యంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఈ సర్వేలో 75 శాతం మందికి తెలియకుండానే వచ్చిపోయిందని తేలింది. అంటే వీరిలో యంటీబాడీల సంఖ్య అతి తక్కువగా ఉండోచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సదరు వ్యక్తులకు వైరస్ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేమని ఓ డాక్టర్ అన్నారు. వాస్తవంగా సాధారణంగానే కనీస యంటీబాడీలు 3 నుంచి 5 ఐజిజి(ఇమ్యూనోగ్లోబలిన్) ఉంటే వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలవు. దీంతో సుమారు సగటును 8 నుంచి 12 నెలల వరకు రక్షణ పొందవచ్చని వైద్యులు అంటున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ స్థాయిలో యంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
సర్వే ఇలా జరిగింది….
వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకు సిసిఎంబి హైదరాబాద్‌లోని 30 వార్డులను ఎంపిక చేసింది. ఒక్కో వార్డులో 300 మంది నుంచి శాంపిల్స్ సేకరించి యాంటీబాడీస్ గుర్తించే పరీక్షలు నిర్వహించారు. పరీక్షల కొరకు సేకరించిన శాంపిల్స్‌లో 10 ఏళ్ల వయస్సు నుంచి 90 ఏళ్ల లోపు వయస్సు వారు ఉన్నట్లు సిసిఎంబి పేర్కొంది. అయితే ఈ సర్వేలో స్త్రీలకు 56 శాతం, పురుషుల్లో 53 శాతం యంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు 70 ఏళ్లకు పై బడిన వారిలో కేవలం 49 శాతం మాత్రమే యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. అంటే ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు అతి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ సోకలేదని సిసిఎంబి సర్వేలో తేలింది. దీంతో పాటు వైరస్ సోకిన కుటుంబాల్లో 78 శాతం మందికి యాంటీబాడీస్ ఉత్పత్తి కాగా, బయట వ్యక్తులు, సమూహాల్లో అత్యధికంగా తిరిగిన వారిలో కేవలం 68 శాతం మందికి సీరో పాజిటివ్ ని కలిగి ఉన్నట్లు సిసిఎంబి స్పష్టం చేసింది. అయితే ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీల్లో వాప్తి అధికంగా ఉండగా, చిన్నఫ్యామిలీలలో అతి తక్కువ వ్యాప్తి ఉన్నట్లు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త “డా ఎన్ లక్ష్మయ్య ”వివరించారు.
జిల్లాల్లో ఇలా…
గత నెలలో సిసిఎంబి వెల్లడించిన లెక్కల ప్రకారం జిల్లాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి కొవిడ్‌కి వ్యతిరేఖంగా పనిచేసే యాంటీబాడీలు వృద్ధి చెందాయి. మే నెలలో 0.33 శాతం ప్రతిరక్షకాలు వృద్ది చెందగా, ఆగస్టులో 12.5, డిసెంబరులో 24 శాతం తేలినట్లు సైంటిస్టులు ప్రకటించారు.
నిశబ్ధంగా వ్యాప్తి చెందుతోందిః డా ఆర్ హేమలత ఎన్‌ఐఎన్ డైరెక్టర్
హైదరాబాద్‌లో నిశబ్ధంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా ఆర్ హేమలత అన్నారు. 75 శాతం మందికి వైరస్ తెలియకుండానే వచ్చిపోయిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని ఆమె వివరించారు. అయితే ఈ సర్వేలో కరోనా సోకిన వారికి, సోకని వారిలో ఒకే రకమైన సీరో పాజిటివిటి ఉందన్నారు. అంతేగాక 18 శాతం మందిలో వేగంగా యాంటీబాడీలు వృద్ధి చెందగా, 90 శాతం మందిలో ఆలస్యంగా ఉత్పత్తి అయినట్లు ఆమె తెలిపారు.
టీకాల ప్రక్రియ వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందిః సిసిఎంబి డైరెక్టర్ డా రాకేష్ మిశ్రా
ప్రస్తుతం కొనసాగుతున్న టీకాల ప్రక్రియ వలన ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సిసిఎంబి డైరెక్టర్ డా రాకేష్ మిశ్రా అన్నారు. ఈమేరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని సురక్షితంగా ఉండాలన్నారు. అయితే తాము చేసిన పరిశోధనల ద్వారా ప్రజల్లో ఏ మేరకు యాంటీబాడీలు ఉన్నాయో గుర్తించామన్నారు. ఈ అధ్యయనం కరోనా వైరస్ నుంచి హైదరాబాద్ జనాభా ఎంత శాతం సురక్షితంగా ఉన్నారనే దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేసిందన్నారు. ఈక్రమంలో ప్రస్తుతం తేలిన సీరో పాజిటివిటీ హెర్డ్ ఇమ్యూనిటీకి చేరవలో ఉన్నట్లు సూచిస్తుందన్నారు.

54% Hyderabad’s people has Antibodies against corona: CCMB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News