Thursday, January 23, 2025

కులగణన జరిగితే బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత ప్రజాస్వామ్యం కొందరి చేతుల్లో బందీ అయిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. 73 ఏళ్ళ భారత రాజ్యంగ పరిపాలనతో నిర్దేశించుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పూర్తి స్థాయిలో జరగలేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఓటు అనే వజ్రాయుధాన్ని డా. బిఆర్ అంబేద్కర్ అందరికీ సమానంగా కల్పించినా కులవర్గ రాజకీయాలను అన్ని పార్టీలు పెంచి పోషిస్తున్నాయని విమర్శించింది. ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యాంగ రిజర్వేసన్లు కల్పించినా… బిసిలకు కేవలం విద్యా, ఉపాధిలోనే 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని, జనాభా ప్రాతిపదికన బిసిలకు రాజ్యాధికారం ఎండమావిగానే మిగిలిందని ఫోరం పేర్కొంది.

కులాల జనగణన జరిగితే బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఓటు అనే వజ్రాయుధంతో మార్పు చేయగలిగితే, అన్ని వర్గాలు ఐక్యంగా ఉండగలిగితే బిసిలకు రాజ్యాధికారం వచ్చితీరుతుందని ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. మార్పు కోసం పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సాహు మహరాజ్, జ్యోతిభా పూలే, డా. బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావులు కృషి చేశారని పేర్కొంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News