- Advertisement -
మంగళూరు : బహ్రయిన్ నుంచి 54 టన్నుల ఆక్సిజన్‌ను భారత్ బుధవారం పొందగలిగింది. మిత్రదేశాల నుంచి ఆక్సిజన్, ఇతర వైద్య అవసరాలు అందుకోడానికి వీలుగా భారత నావికా దళం ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు 2 లో భాగంగా ఇది బహ్రయిన్ నుంచి రవాణా అయింది. ఈ 54 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకు వచ్చిన ఐఎన్‌ఎస్ తల్వార్ బుధవారం న్యూ మంగళూరు రేవుకు చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమం లోని కువైట్ నుంచి తూర్పున సింగపూర్ వరకు తొమ్మిది యుద్ధ నౌకలను ఇదే విధంగా పంపినట్టు చెప్పారు.
- Advertisement -