Sunday, January 19, 2025

పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్‌పైకి భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు.దీంతో అంబాలాఅమృత్‌సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఛలో పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 13న రైతులు చేస్తున్న పాదయాత్రకు పంజాబ్, హర్యానాల మధ్య సరిహద్దు శంభు, ఖనౌరి వద్ద నిలిపివేశారు. నాటి నుంచి రైతులు అక్కడే ఉన్నారు.

వారిలో నవదీప్, గుర్మిరాత్, అనీష్ ఖతర్‌లను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. వారిలో అనీష్ అరెస్ట్ అయిన నాటి నుంచి నిరాహార దీక్ష సాగిస్తుండడంతో అతడి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనిపై రైతుల ఆందోళన మరింత తీవ్రమవుతోంది. ఈ ముగ్గురు రైతులను విడిచిపెట్టేవరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. రైతులకు మంచి చేసే నాయకునికే ఓటు వేయాలని ఆయన రైతులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News