Monday, December 23, 2024

ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ డే… ఇండిగో సిబ్బందిలో ఎక్కువ సిక్ లీవ్‌లు

- Advertisement -
- Advertisement -

55% IndiGo crew call sick on AI recruitment day

ఇండిగో స్వదేశీ సర్వీసులు 55 శాతం ఆలస్యం

న్యూఢిల్లీ : ఇండిగో విమానాల సిబ్బందిలో అధికశాతం మంది శనివారం సిక్‌లీవ్ పెట్టడంతో 55 శాతం ఇండిగో స్వదేశీ విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ శనివారం చేపట్టడంతో ఇండిగో విమానాల సిబ్బంది సిక్ లీవ్ పెట్టి వెళ్లారని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై డిజిసిఎ చీఫ్ అరుణ్‌కుమార్‌ను అడగ్గా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎయిర్ ఇండియా రెండో దశ రిక్రూట్‌మెంట్ శనివారం జరిగింది. దీనిపై ఇండిగో ఎయిర్ సిబ్బంది అధిక సంఖ్యలో సిక్‌లీవ్ పెట్టి ఆ రిక్రూట్ మెంట్‌కు హాజరయ్యారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శనివారం 45.2 శాతం మాత్రమే ఇండిగో స్వదేశీ విమానాలు నడిచాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ వెల్లడించింది. మిగతా విమాన సర్వీసులతో పోల్చిచూస్తే శనివారం ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్ ఆసియా సర్వీసులు క్రమంగా 77.1 శాతం, 80.4 శాతం, 86.3 శాతం, 88 శాతం, 92. 3 శాతం మేరకు నడిచాయి. ఎయిర్ ఇండియా సర్వీస్‌ను టాటా గ్రూప్ జనవరి 27న తన అధీనం లోకి తెచ్చుకుంది. కొత్తగా మరికొన్ని విమానాలను కొనుగోలు చేసి సర్వీసులను విస్తరించడానికి వీలుగా తాజాగా సిబ్బంది నియామకాలను చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News