Monday, December 23, 2024

బర్కినా ఫాసోలో జిహాదీల దాడిలో 55మంది మృతి

- Advertisement -
- Advertisement -

55 killed by Militants in Burkina Faso

ఒవాగడోగో(పశ్చిమ ఆఫ్రికా): పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఆదివారం ఇస్లామిక్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 55 మంది పౌరుల మరణించారు. సెనో ప్రావిన్సులోని సీటెంగలో పౌరులుపై ఇస్లామిక్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 55మంది పౌరులు మరణించగా అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుంది. బర్కినా ఫాసోలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూపునకు చెందిన తీవ్రవాదులు సాగిస్తున్న హింసాకాండలో వందలాది మంది పౌరులు మరణించారు. 2021 జూన్‌లో సోల్హన్ పట్టణంలో జిహాదీలు జరిపిన కాల్పులలో 160 మంది పౌరులు మరణించారు.

55 killed by Militants in Burkina Faso

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News