న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఇప్పటికే 55 లక్షల మంది స్వస్థలాలను వదిలేసి వెళ్లి పోయారని ఐక్యరాజ్యసమితి శరణార్ధుల విభాగం యూఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. ఫిబ్రవరి 24 నుంచి లెక్కల ప్రకారం దీన్ని అంచనా వేసింది. ఈమేరకు సోమవారం నివేదిక విడుదల చేసింది. వేర్వేరు చోట్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడంతోపాటు సరిహద్దుల వద్ద చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేతిన పెట్టుకుని బయటపడిన వారిలో ఏప్రిల్ 29 నాటికి 30 లక్షల మంది పోలాండ్‌కు వెళ్లారు. రొమానియాకు 8,17,000 మంది , స్లొవాకియాకు 3,72,000 మంది వెళ్లారు. మరోపక్క అజోవ్‌స్తల్ ఉక్కు కర్మాగారంలో చిక్కుకు పోయిన వారిని విడిపించే పని కొనసాగుతోంది. ఇప్పటివరకు 100 మందిని ఉక్కు కర్మాగారం నుంచి బయటకు తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీరిని జాపార్జియాకు తరలించారు.
ఉక్రెయిన్ సంక్షోభం… శరణార్ధులుగా 55 లక్షల మంది
- Advertisement -
- Advertisement -
- Advertisement -