Wednesday, January 22, 2025

యువకుని కడుపులో 56 లోహపు వస్తువులు

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో 15 ఏళ్ల బాలుని కడుపులో నుంచి 56 లోహపు వస్తువులు తొలగించేందుకుఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో పెద్ద శస్త్రచికిత్స జరిగిన మరునాడు మరణించాడు. వాటిలో బ్యాటరీలు, బ్లేడ్లు, మేకుఉల, ఇతర లోహపు ముక్కలు కూడా ఉన్నాయి. తొమ్మిదవ తరగతి విద్యార్థి అయిన ఆదిత్య శర్మ శరీరం లోపల అనేక పరాయి వస్తువులు బహిర్గతం కావడం వైద్య లోకాన్ని దిగ్భ్రమపరచిందని, తమ కుటుంబం వణికిపోయిందని బాలుని తండ్రి,

హథ్రాస్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సంచిత్ శర్మ ‘పిటిఐ’తో చెప్పారు. బాలుడు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సర్జరీ మరునాడు మరణించినట్లు, అతని హృదయ స్పందన రేటు బాగా పెరిగిపోయినట్లు, బిపి ఆందోళనకరంగా పడిపోయినట్లు సంచిత్ శర్మ తెలిపారు. ఉత్తర ప్రదేశ్, జైపూర్, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో పలు వైద్య పరీక్షల్లో పరాయి వస్తువులను కనుగొన్నట్లు ఆయన చెప్పారు. తమ కుమారుడు తీవ్ర కడుపు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేసిన తరువాత తమ కుటుంబం ఇక్కట్లు మొదలయ్యాయని సంచిత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News