Monday, December 23, 2024

560 శవాలను ముక్కలు చేసి అవయవాలను అమ్ముకుంది

- Advertisement -
- Advertisement -

 

కొలరాడో(అమెరికా): తన దహనవాటికకు వచ్చిన 560 మృతదేహాల నుంచి అవయవాలను వేరు చేసి అక్రమంగా వాటిని విక్రయించిన 46 ఏళ్ల ఒక మహిళకు కోర్టు మంగళవారం 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. సన్‌సెట్ మెసా పేరుతో ఫ్యూనరల్ హోమ్ నడుపుతున్న మెగాన్ హెస్ అనే ఆ మహిళ అదే భవనంలో అవయవ దానానికి సంబంధించిన ఒక సేవా సంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ నేరాలలో పాలుపంచుకున్న ఆమె 69 ఏళ్ల తల్లి షెర్లీ కోచ్‌కు కూడా 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. మృతదేహాలను ముక్కలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని కోర్టు తేల్చింది. తమ ఫ్యూనరల్ హోమ్‌కు వచ్చిన శవాలను వారి బంధువులకు తెలియకుండా చోరీ చేసి వాటి నుంచి అవయవాలను వేరు చేసి ఈ తల్లీకూతుళ్లు అమ్ముకునేవారని కోర్టులో తీర్పులో పేర్కొంది. అమెరికాలో మావన అవయవాల అమ్మకంపై రాయటర్స్ జర్నలిస్టులు 2018లో పరిశోధనాత్మక కథనాలు వెలువరించారు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి హెస్, ఆమె తల్లి కోచ్‌లను నిందితులుగా నిర్ధారించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు వీరిద్దరికీ జైలు శిక్షను ఖరారు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News