Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

560 Kg Ganja Seized in Hyderabad

హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని చిత్రకొండ నుంచి డిసిఎం వాహనంలో పెద్ద మొత్తంలో గంజాయిని మహారాష్ట్ర తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అనుమానం రాకుండా బంగాళాదుంపల క్రింద గంజాయి పొట్లాలను దాచి తరలించేందుకు కేటుగాళ్లు ప్రయత్నించారు. హిమాయత్ సాగర్ సమీపంలో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు చేపట్టారు. అదే సమయానికి అక్కడికొచ్చిన డిసిఎం వ్యాన్ ను తనిఖీ చేసి 560 కిలోల గంజాయినిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

560 Kg Ganja Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News