Friday, January 24, 2025

5617 టిఎంసిలు కడలిపాలు

- Advertisement -
- Advertisement -

100 రోజుల్లో సముద్రంలో కలిసిన కృష్ణా, గోదావరి జలాలు 
తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ రబీలకు 5 పంట నీరిది, కాటన్ బ్యారేజీ మీదుగా గోదావరిలో 4964 
ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిలో 653టిఎంసిలు, గత ఏడాదిలోనూ సముద్రానికి 3003

మనతెలంగాణ/హైదరాబాద్: అత్యల్ప వర్షపాత జోన్‌లో వున్న కరువు పీడిత ప్రాంతాలకు ప్రతి నీటిచుక్కా అమృత తుల్యమే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ, రాయల సీమ ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి ఉన్న కొరత దశాబ్ధాల తరబడి అక్కడి క్షామపీడిత ప్రజలకు తెలియందేమి కాదు. వర్షాలనే నమ్ముకొని దుర్భిక్ష పరిస్థితుల్లో వేసిన పంటలు నిలువునా ఎండిపోయి సీమలో డొక్కల కరువులు, బతుకు పోరాటంలో పొట్టచేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు పాలమూరు బిడ్డల వలసలకు నీటిచుక్కల విలువేంటో తెలిసినంతగా ఇతర ప్రాంతాల వారికి తెలిసిండుకపోవ చ్చు.. ఈ ఏడాది వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం ప్రారంభమయ్యాక జూన్ నుం చి ఇప్పటివరకూ కేవలం వంద రోజుల వ్యవధిలో కృష్ణా, నదుల నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా 5617టిఎంసిల నీరు కడలిలో కలిసిపోయాయి. అందులో గోదావరి నది నుంచి ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ మీదుగా 4964క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి జారుకున్నాయి. ఇటు కృష్ణా నుంచి కూడా సముద్రం పాలైన నదీజలాలు పరిమాణం తక్కువేమి కాదు. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ మీదుగా 653టిఎంసిల వరదనీరు సముద్రంలోకి పరుగులు తీసింది. కృష్ణానది పరివాహకంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలంగాణతో కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అప్పటి జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో లభ్యమయ్యే 2130 కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు 811టిఎంసీల వాటా లభించింది. ఇటు గోదావరి నదిలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి 1470టిఎంసీల నీటికేటాయింపులు జరిగాయి. అటు కృష్ణా, ఇటు గోదావరి నదుల ద్వారా తెలుగు రాష్ట్రాలకు బచావత్ చేసిన నీటి ప్రతియేటా వానాకాలం, యాసంగి సీజన్లతో కలిపి మొత్తం 2280టిఎంసిల నీటిని ఉపయోగించుకుని పంటలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల ద్వారా కృష్ణా, నదుల నుంచి తెలుగు రాష్ట్రా లు ఉపయోగించుకోలేని అని వార్య పరిస్థితుల్లో సముద్రంలోకి కలిసిపోయిన 5617టిఎంసీలు ఖరీఫ్, రబీ సీజన్లతో కలిపి కోట్లాది ఎకరాల్లో 5 పంట కాలాలకు సమృద్ధిగా సరిపోయివుండేవని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. వంద రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం లో వరద నీరు వృథాగా సముద్రంపాలు కావటం ఆం దోళన గొలుపుతోంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానదిలో 12అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. బ్యారేజి మీదుగా 2,74,150క్యూసెక్కుల (27టిఎంసీలు)నీరు సముద్రంలోకి వెళుతోంది. గత ఏడాది కూడా జూన్ ప్రారంభం నుంచి ఈ ఏడాది మే నెల చివరివరకూ ప్రకాశం బ్యారేజి మీదుగా 501టిఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ప్రకాశం బ్యారేజి నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకున్న నీరు 170టిఎంసీల లోపే ఉంది. ఇటు గోదావరి నదలో కూడా ఇదే పరిస్థితి నెలకుంది. గత ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఈ ఏడాది మే చివరి నాటికి ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజి మీదుగా 2502టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోయింది. గత ఏడాది ఎపిలో గోదావరి డెల్టా ప్రాంత ఆయకట్టుకు ఉపయోగించుకున్న నీరు 250టిఎంసీలకు మించలేదు. గత ఏడాది కృష్ణా, గోదావరి నదుల ద్వారా 3003 టిఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి జారుకుంది. ఈ ఏడాది వర్షాకాలం ముగిసేలోపు మరెంత నీరు సముద్రంలో కలిసిపోతుందో అధికారులు సైతం అంచాన వేయలేకపోతున్నారు. కృష్ణా,గోదావరి నదుల పరివాహకంగా వందేళ్ల చరిత్రలో ఈ ఏడాది కురిసినంతటి భారీవర్షాలు అరుదుగా ఉంటాయని, నదుల్లో వరద ప్రవాహాలు కూడా సముద్రంలోకి వృధాగా కలవటం అరుదుగానే ఉంటుందని నీటిపారుల శాఖ అధికారులు చెబుతున్నారు.

5617 tmc water into Krishna and Godavari Rivers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News