Friday, December 20, 2024

సందడి… సందడిగా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో హోరెత్తించారు. సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా టి.పద్మారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కరీంనగర్ లోక్‌సభ బిజెపి అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు.

ఆయన తరపున కుటుంబ స భ్యులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. హైదరాబాద్ లోక్‌సభ ఎంఐఎం అ భ్యర్థిగా అసదుద్దీన్ ఒవైసీ, నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఖమ్మం బిజెపి అభ్యర్థి వినోద్‌రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ. బిఆర్‌ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, బిజెపి అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, చేవెళ్ల బి ఆర్‌ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి సి పిఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్, బిజెపి అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అ భ్యర్ధిగా వంశీ చంద్ రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News