- Advertisement -
గంధమల్ల రిజర్వాయర్ సామర్ధం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 4.28 టీఎంసీల సామర్ధం ఉన్న గంధమల్ల రిజర్వాయర్ నీటి సామర్ధాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు నీరు అందించే లక్షంతో గంధమల్ల రిజర్వాయర్ ను గత ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గంధమల్ల రిజర్వాయర్ సామర్ధం 1.41 టీఎంసీలుగా నిర్ధారిస్తూ దాని నిర్మాణ పనులకు రూ. 575.55 కోట్ల అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.
- Advertisement -