- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న వేళ తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధి పట్టుకుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 5,763 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వ్యాధిబారినపడి 476 మంది మరణించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్న వేళ బ్లాక్ ఫంగస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. అటు బ్లాక్ ఫంగస్ బారిన పడిన ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రైవేటు ఆసుపత్రులలో ఫంగస్ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది.
5763 Black Fungus cases reported in Maharashtra
- Advertisement -