Wednesday, November 20, 2024

కబ్జా యత్నం భగ్నం

- Advertisement -
- Advertisement -

58 arrested in Banjara Hills land case

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని దాదాపు
రూ.100 కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు యత్నించిన ముఠా

మారణాయుధాలతో దౌర్జన్యానికి
పాల్పడడంతో కేసు నమోదు
చేసిన పోలీసులు ఘటనతో
బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి
వెంకటేశ్‌కు సంబంధం అతడు
అతడి అన్న కుమారుడిపై కేసు

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించి 58మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌పై చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుల్లో ఏ5గా మాజీ ఎంపి టిజి వెంకటేష్ పేరును పోలీసులు చేర్చారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని సర్వే నంబర్ 403లో రెండున్నర ఎకరాల భూమి ఏపి జెమ్స్ అండ్ జువెల్లరీస్‌కి అప్పటి సిఎం చంద్రబాబు కేటాయించారు. ఆ సంస్థ ఒకటిన్నర ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టింది. తమ భూమిలో సదరు సంస్థ సెక్యూరిటీ గార్డులను నియమించింది. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ స్థలం తమదేనని పాతబస్తీకి చెందిన వివిఆర్ శర్మ అనే వ్యక్తి డాక్యుమెంట్లతో రాగా భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉంటుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపి టిజి వెంకటేష్ సోదరుడి కుమారు విశ్వప్రసాద్‌కు చెందిన కంపెనీతో వివిఆర్ శర్మ ఒప్పందం చేసుకున్నాడు.

అప్పటి నుంచి విశ్వప్రసాద్ , అతడి కంపెనీ ప్రతినిధులు ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించినా సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. మరోసారి భూమిని ఆక్రమించేందుకు నిందితులు కార్లలో 80మందిని తీసుకుని ఆదివారం రాత్రి కబ్జా చేసేందుకు యత్నించారు. గేట్, తాత్కాలిక నిర్మాణాలను కూల్చి వేశారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న బజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో మాజీ ఎంపి టిజి వెంకటేష్, అతడి సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్, సుభాష్ పులిశెట్టి, మిథున్, వివిఎస్ శర్మతో పాటు మిగతా వారిని చేర్చారు. ఇందులో 62మంది పట్టుబడగా 58మందిపై కేసు నమోదు చేసుకుని చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. నిందితులు 2021లో కూడా ఇలాగే ఆక్రమించుకునేందుకు యత్నించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారంః టిజి విశ్వప్రసాద్

భూమి వివాదంలో టిజి వెంకటేష్‌కు ఎలాంటి సంబంధంలేదని టిజి వెంకటేష్ సోదరుడి కుమారుడు టిజి విశ్వప్రసాద్ తెలిపారు. తాను సంఘటన స్థలంలో లేనని,ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని తెలిపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. స్థలానికి సంబంధించిన పూర్తి హక్కులు తమవేనని స్పష్టం చేశారు. తమ కంపెనీకి చెందిన సినిమా అవుట్‌డోర్ యూనిట్ టీమ్ పూజా కార్యక్రమం నిర్వహించిందని, ఈ కార్యక్రమానికి గ్రామం నుంచి 70మంది వచ్చారని తెలిపారు. తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని,అందులో నిజం లేదని తెలిపారు.

అది ప్రభుత్వ భూమిః షేక్‌పేట తహసిల్దార్

బంజారాహిల్స్ రోడ్డు నంబర్10లోని సర్వే నంబర్ 403లో ఉన్న భూమి ప్రభుత్వానిదని షేక్‌పేట తహసిల్దార్ స్పష్టం చేశారు. త్వరలోనే భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమి ప్రైవేట్ వ్యక్తులది కాదని, ప్రభుత్వ భూమని అన్నారు.

కేసుతో నాకు సంబంధం లేదుః టిజి వెంకటేష్

బంజారాహిల్స్ భూవివాదంతో తనకు సంబంధం లేదని మాజీ ఎంపి టిజి వెంకటేష్ తెలిపారు. తన పేరును ఏ5గా చేర్చడంపై ఆయన స్పందించారు. బంజారాహిల్స్ భూవివాదంతో నాకు సంబంధంలేదు, పోలీసులు బెదిరిస్తే నిందితులు నా పేరు చెప్పి ఉండొచ్చు, ఇది కావాలని నాపై చేసిన ఆరోపణ మాత్రమే, ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేనిది రిమాండ్ రిపోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News