Monday, December 23, 2024

టెన్త్ పరీక్షకు 58 ఏండ్ల ఒడిషా ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

58-year-old Odisha MLA for Tent exam

 

ఫుల్బణీ : ఒడిశాలో 58 సంవత్సరాల ఎమ్మెల్యే అంగద కన్హర్ ఇప్పుడు జరుగుతోన్న పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారు. పుల్భణీ నియోజకవర్గపు బిజెడి ఎమ్మెల్యే అయిన అంగద చదువుకోవడానికి వయస్సులతో సంబంధం లేదని తెలిపారు. శుక్రవారం ఆయన ఇతరులతో కలిసి స్థానికంగా ఉన్న స్కూల్‌లో మొదటి ఆంగ్ల పరీక్షకు హాజరయ్యారు. తాను చిన్ననాట కుటుంబ సమస్యలతో 1978లో టెన్త్ పరీక్షలకు హాజరుకాలేకపోయినట్లు అయితే 50 ఏండ్లు దాటిన వారు పలువురు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిసిందని అందుకే పట్టుదలతో చదివి పరీక్షకు వచ్చానని ఈ ఎమ్మెల్యే తెలిపారు. ఒడిషాకే చెందిన ఓ సర్పంచ్ కూడా తన పెద్ద వయస్సులో టెన్త్ పరీక్షకు హాజరవుతూ విస్మయం కల్గిస్తున్నారు. 40ఏళ్ల విరామం తరువాత ఇప్పుడు ఎమ్మెల్యే పరీక్ష హాల్‌కు రావడం రాజకీయవర్గాలలోనూ విస్మయానికి దారితీసింది. ఎన్నికలలో గెలిచిన ఈ వ్యక్తి ఈ పరీక్షలలో రాణిస్తాడా ? ఫలితం కోసం ఎదురుచూద్దాం అని కొందరు వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News