Wednesday, January 22, 2025

58 ఏళ్ల మహిళపై 16ఏళ్ల బాలుడి హత్యాచారం..

- Advertisement -
- Advertisement -

రేవా(మధ్యప్రదేశ్): 58 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ 16 ఏళ్ల బాలుడు ఆమె కాళ్లు చేతులు కట్టేసి, నోట్టో గుడ్డలు కుక్కి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా కైలాష్‌పురి గ్రామంలో జనవరి 30న రాత్రి జరిగింది.  ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన ఆ బాలుడు మంచంపై నిద్రిస్తున్న ఆ మహిలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు, ప్లాస్టిక్ సంచి కుక్కి, ఆమె తలపైన, శరీర భాగాలపైన కొడవలితో కొట్టి గాయపరచడమేకాక ఆమె మర్మావయావాలను కర్రతో గాయపరిచాడని తెలిపారు.ఆమె మృత దేహాన్ని ఈడ్చుకుంటూ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లి పడేసి పరారయ్యాడని పోలీసులు చెప్పారు.

రెండేళ్ల క్రితం తన ఇంట్లో మొబైల్ ఫోన్‌ను ఆ బాలుడే చోరీ చేసినట్లు ఆ మహిళ ఆరోపించిందని, దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఫిబ్రవరి 1న తమకు సమాచారం అదిందని అదనపు ఎస్‌పి వివేక్ లాల్ తెలిపారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారని ఆయన చెప్పారు. దర్యాప్తును చేపట్టిన పోలీసులు సమీపంలోనే నివసించే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టివి చూసేందుకు ఆ బాలుడు తమ ఇంటికి రెండేళ్ల క్రితం వరకు వచ్చేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్ ఫోన్ చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆ బాలుడు గ్రామంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News