Sunday, January 19, 2025

14 వరద బాధిత రాష్ట్రాలకు 5858 కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం నిధులు
తెలంగాణకు రూ. 416.80 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ 14 వరద బాధిత రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుంచి కేంద్రం వాటాగా, జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి అడ్వాన్స్‌గా రూ. 5858.60 కోట్లు విడుదల చేసినట్లు ఢిల్లీలో అధికారులు వెల్లడించారు. ఆ నిధుల్లో మహారాష్ట్రకు రూ. 1492 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 1036 కోట్లు, తెలంగాణకురూ. 416.80 కోట్లు, అస్సాంకురూ. 716 కోట్లు, బీహార్‌కు రూ. 655.60 కోట్లు, గుజరాత్‌కు రూ. 600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 468 కోట్లు విడుదల చేసినట్లు ఒక అధికార ప్రకటన తెలియజేసింది.

హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మోడీ ప్రభుత్వం ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు ప్రకృతి వైపరీత్యాల బాధిత రాష్ట్రాలతో భుజం భుజం కలిపి సాగుతోందని ఆ ప్రకటన పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News