- Advertisement -
బర్కినో ఫాసోలో ఘోర దుర్ఘటన
క్వాగడోగో: బర్కినా ఫాసోలోని బంగారు గని సమీపంలో సోమవారం భారీ పేలుడు సంభవించి 59 మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు. నిల్వచేసిన బంగారు ఖనిజాన్ని కరిగించేందుకు రసాయనాలను ఉపయోగించిన సందర్భంగా భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని వార్తా సంస్థలు తెలియచేశాయి. ఆఫ్రికా ఖండంలో స్వతంత్ర దేశమైన బర్కినా ఫాసోలో అపారమైన బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. బంబ్లోరా గ్రామంలోని బంగారు గని సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎక్కడ చూసిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేలుడు సమయంలో అక్కడకు సమీపంలోనే ఉన్న ఫారెస్ట్ రేంజర్ సన్సన్ కంబో మీడియాకు తెలిపారు. మొదటి పేలుడు మధ్యాహ్నం 2 గంటలకు జరగగా వరుసగా మరికొన్ని పేలుళ్లు సంభవించాయి. గ్రామస్థులు ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారని స్థానికులు తెలిపారు.
- Advertisement -