Friday, November 15, 2024

59 శాతం ఆర్‌టిఐ దరఖాస్తులు తిరస్కరణ : సిఐసి

- Advertisement -
- Advertisement -

59% RTI applications rejected: CIC

వ్యక్తిగత సమాచార బహిర్గతం , ఇతర మినహాయింపులే కారణం

న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, భద్రత, నిఘా సంస్థలకు ఆర్‌టిఐ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వడం తదితర కారణాల ఆధారంగా ఆర్‌టిఐ (సమాచార హక్కు చట్టం) దరఖాస్తుల్లో 59 శాతం 2019-20 లో చట్ట ప్రకారం తిరస్కరణకు గురయ్యాయని సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) వార్షిక నివేదిక వెల్లడించింది. 2019-20 లో 2131 ప్రజా సంస్థల నుంచి 13.74 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ సంఖ్య 2018-19 కన్నా 0.3 శాతం ఎక్కువని, ఇదే సందర్భంగా తిరస్కరణ రేటు గతం కన్నా తక్కువగా 4.27 శాతం వరకు ఉన్నట్టు కమిషన్ వివరించింది.

చట్టం లోని సెక్షన్లు 8,9,11, 24 ఇచ్చిన మినహాయింపుల ప్రకారం తిరస్కరణకు వీలౌతుందని, కానీ ఈ నివేదికలో ‘ఇతర కారణాలు’ అన్న కేటగిరి కింద ప్రభుత్వ విభాగాలు దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయని కామన్‌వెల్తు హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్ కు చెందిన వెంకటేష్ నాయక్ ఆరోపించారు. 2019-20లో మొత్తం 62,123 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, వీటిలో 38, 064 చట్టం లోని మినహాయింపుల క్లాజుల కింద తిరస్కరణ కాగా, మిగిలిన దరఖాస్తులు ‘ఇతర కారణాలు ’ అన్న కేటగిరి కింద దరఖాస్తుల విలువను పరిశీలించకుండా తిరస్కరించినట్టు ఆరోపించారు. ఇతర కారణాలు అన్న కేటగిరి తప్పుడు కేటగిరిగా ఆయన విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News