Monday, December 23, 2024

ఏఐ, 5జి అనేక రంగాల్లో మార్పు తేనుంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ), 5జి అనేక రంగాలలో మార్పు తేనున్నదని ప్రధాని మోడీ అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) ఆటోమేట్‌గా పనిచేయడమేకాక సంక్లిష్ట పనులను కూడా చేస్తుందని అన్నారు. ఆయన మంగళవారం పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ‘అన్‌లీజింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ అంశంపై మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇండియాలో పెద్ద ఎత్తున డిజిటల్ మౌలికవసతులు సృష్టించామని, అది దేశంలోని ప్రతి మూల డిజిటల్ విప్లవం తేడానికి తోడ్పడుతుందని అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, తదితర రంగాల్లో కృత్రిమ మేధ, 5జి మొబైల్ సేవలు పెనుమార్పులు తేగలదన్నారు. సామాన్యున్ని బాధిస్తున్న 10 సమస్యలను గుర్తించాలని ఆయన స్టేక్‌హోల్డర్లను కోరారు. కృత్రిమ మేధ ఆ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. సాంకేతికత సాయంతో 2047 నాటికి భారత్ ఓ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని అన్నారు. కాంప్లియన్స్ కాస్ట్‌లు తగ్గించడం ద్వారా చిరు వ్యాపారాలకు తోడ్పాడాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

‘పన్ను వ్యవస్థను ఫేస్‌లెస్ చేయడానికి, పన్ను చెల్లించేవారి సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాము’ అన్నారు. పౌరుల జీవితాల్లో గుణాత్మక వ్యత్యాసాన్ని తేడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
భారత దేశం ఆధునిక డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సృష్టిస్తోందని, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు అందరికీ చేరేలా చూస్తోందని మోడీ పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్ నంబర్ కలగలిపిన ‘జెఎఎం ట్రినిటీ’ అన్నది ‘ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు’ ఏర్పాటుకు వీలుకల్పించిందన్నారు. పేదలకు ప్రయోజనాలు చేకూర్చిందన్నారు. 21వ శతాబ్దాన్ని సాంకేతికతతో నడిపిస్తున్నామని, దీనిని కేవలం డిజిటల్, ఇంటర్నెట్ టెక్నాలజీకే పరిమితం చేయలేమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News