Wednesday, January 8, 2025

బంపర్ ఆఫర్.. కేవలం రూ.10000 కే 5G ఫోన్స్

- Advertisement -
- Advertisement -

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముగించుకొని బిగ్ బచాట్ డేస్ సేల్‌తో మరోసారి తిరిగి వచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి గాడ్జెట్‌లు, గృహోపకరణాల వరకు ప్రతిదానిపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక మీ బడ్జెట్ రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే, బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే, ఈరోజు సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5G ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి

ఈ డీల్ జాబితాలో మొదటి ఫోన్ గురించి మాట్లాడుతే.. Infinix Hot 50 5G ఉంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ ధర మాత్రం రూ.12,999 ఉండే. దీని ధర ఫ్లిప్ కార్డ్ లో రూ. 9,999 గా ఉంది. దీని ప్రకారం.. ఫోన్‌పై 23% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల గురుంచి మాట్లాడుతే.. ఫోన్‌లో 4 GB RAM, 6.7 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది. అద్భుతమైన ఫోటల కోసం కెమెరా 48MP + డెప్త్ సెన్సార్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది, బ్యాటరీ గురుంచి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ కలిగి ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో అమర్చారు.

లావా బ్లేజ్ 2 5జి

రెండో జాబితాలో ఉన్న ఫోన్ లావా.. ఈ ఫోన్ కూడా 9,698 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, కంపెనీ దీన్ని రూ. 11,499కి లాంచ్ చేసింది. ఆఫర్ తర్వాత ఫోన్‌పై 15% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా రూ. 1500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 4 GB RAM, 6.56 అంగుళాల Full HD+ డిస్ప్లే కలిగి ఉంది. ఇక కెమెరా 50 MP ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News