Wednesday, January 22, 2025

ఈ ఏడాది చివరికి 5జి నెట్‌వర్క్..

- Advertisement -
- Advertisement -

5G Network in 20-25 Cities by end of 2022: Ashwini Vaishnaw

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జి నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో పోల్చితే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా చార్జీలు ప్రపంచంలోనే చాలా తక్కువని వెల్లడించారు.శనివారం టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన అశ్విని వైష్ణవ్, 5జి గురించి మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి 20-25 నగరాల్లో అందుబాటులోకి వస్తుందని నమ్మకంతో చెబుతున్నానని అన్నారు. ‘విశ్వసనీయ నెట్వర్క్ ప్రొవైడర్ల జాబితాలో భారతదేశం పేరు అగ్రస్థానంలో ఉంది. భారతదేశం అభివృద్ధి చేసిన సాంకేతికతపై ప్రపంచం ఆసక్తి చూపుతోంది’ అని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా డేటా రేట్లు సగటున 25 డాలర్లు ఉండగా దేశంలో కేవలం 2 డాలర్లగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ నేపథ్యంలో 5జి డేటా రేట్లు కూడా దీనికి అనుగుణంగా తక్కువగానే ఉంటాయని చెప్పారు. ‘భారత టెలికామ్ కొత్త శకానికి 5జి నాంది’ అని అభివర్ణించారు. 5జి టెక్నాలజీతోపాటు రాబోయే 6 జి టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఆవిర్భవించే సమయం ఎంతో దూరంలో లేదని అన్నారు. కాగా, 5జిస్పెక్ట్రం బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెలాఖరులో వేలం జరుగవచ్చని భావిస్తున్నారు. 72 జీహెడ్జ్‌ను 20 సంవత్సరాలకు అమ్మనున్నారు. 5జి సేవలు 4జి కంటే పది రెట్లు వేగంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

5G Network in 20-25 Cities by end of 2022: Ashwini Vaishnaw

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News